నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు దాదాపు 15 వేల మంది విద్యార్థులతో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటేడ్ గురుకులాల ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు పూర్తి వివరాలు వివరించనున్నట్లు సెక్రటేరియట్లో మంగళవారం పేర్కొన్నారు. 20-25 ఎకరాల్లో 2500 మంది విద్యార్థుల కేపాసిటీతో గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.