సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బుధవారం కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు సాయి రాజేంద్రప్రసాద్ వివాహ వేడుక ఆహ్వాన పత్రికను సీఎంకు కాసాని దంపతులు అందజేశారు. వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సీఎం రేవంత్ ను కాసాని జ్ఞానేశ్వర్ కోరారు.