బొడుప్పల్ విజయరత్న హై స్కూల్ లోని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జంగిటి కైలసం అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా రామినేని వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాల పీఆర్సిని వెంటనే అమలు చేసి, జీవో నెంబర్ 317 బాధ్యతులకు వెంటనే న్యాయం జరగాలని అన్నారు.