జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 1లో ఆదివారం వేకువజామున పేలుడు జరిగిన తెలంగాణ స్పెస్ కిచెన్ ను సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. పేలుడు దాటికి హోటల్ వెనుక భాగంలో ఉన్న గది, ప్రహరీ కూలి రాళ్లు, ఇనుప రాడ్లు, రేకులు వందమీటర్ల వరకు ఎగరడంతో పేలుడు తీవ్రతను పరిశీలించి కారణాలను తెలుసుకున్నారు.