రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి తలసాని..

83చూసినవారు
రంజాన్ సందర్భంగా సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లీంలు సామూహిక ప్రత్యేక ప్రార్థనల్లో నిర్వహించారు. ఈ సామూహిక ప్రార్థనలకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లీంలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you