మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లోని రెడ్డి కాలనీ నుండి బాడీ గార్డ్ లేన్ వరకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బల్లాల నూతన సీసీ రోడ్డు పనులను పూర్తిగా సందర్శించడం జరిగింది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్ ప్రజలతో సమావేశమై డివిజన్ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ మలక్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఎండి సైఫ్ ఉద్దీన్, షాఫీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.