ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
గాంధీ ఆసుపత్రిలో మాతా, శిశు మరణాలు పెరిగాయని ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురు సభ్యులతో నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. సోమవారం బీఆర్ఎస్ నేతలు గాంధీకి వస్తారన్న సమాచారంతో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. ఇప్పటికే డీఎంఈ, హెల్త్ కమిషనర్ గాంధీకి చేరుకున్నారు.