తలసాని శంకర్ యాదవ్ కు నివాళులర్పించిన కార్పొరేటర్ సామల హేమ

80చూసినవారు
తలసాని శంకర్ యాదవ్ కు నివాళులర్పించిన కార్పొరేటర్ సామల హేమ
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ వారి నివాసానికి చేరుకుని ఆయన పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించారు. వారి వెంట స్థానిక నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్