ప్రైవేటు బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన మేడ్చల్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. శివాలయ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజన్ను ఆపి బస్సును పక్కకు నిలిపాడు. గమనించిన స్థానికులు బస్సు వద్దకు చేరుకుని బకెట్లతో నీళ్లును పోసి మంటలను ఆర్పేశారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.