మేడ్చల్: చిరు వ్యాపారులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన మార్కెట్లో ముందస్తు సమాచారం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దుకాణాలను మున్సిపాలిటీ అధికారులు మరియు పోలీసు సిబ్బంది గురువారం తొలగించారు. సమాచారం తెలియగానే బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని చిరు వ్యాపారులకు మద్దతుగా నిలిచారు. మేడ్చల్ మార్కెట్ యార్డులో వ్యాపారం చేసుకొనుటకు అధికారులను కోరడం జరిగింది.