జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్లో బుధవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొని చౌరస్తా నుంచి సాగర్ హోటల్ వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న హరికృష్ణగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.