సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం 14 ఏళ్ల మైనర్ బాలుడిని పోలీసులు రక్షించినట్లుగా తెలిపారు. వెట్టిచాకిరి కోసం ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లుగా గుర్తించి, పకడ్బందీ సమాచారంతో తనిఖీలు చేపట్టిన బృందం, ఎట్టకేలకు తరలిస్తున్న బృందం సభ్యులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.