హైడ్రా గురించి బ్యాంకర్లకు ఆందోళన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బుధవారం హైదరాబాద్ ప్రజా భవన్లో సమావేశం నిర్వహించారు. ఎన్హెచ్లో రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందన్నారు. ఎన్హెచ్లో సభ్యులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలని భట్టి ఈ సందర్భంగా అన్నారు.