రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారం సాధించడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల సమరభేరీ సభకు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం తప్పక వస్తుందన్నారు.