

నాంపల్లి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ట్రాన్స్ జెండర్లు నిరసన
హైదరాబాద్లో ట్రాన్స్ జెండర్లు, ట్రాఫిక్ అసిస్టెంట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద నిరసన చేపట్టారు. మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామని ప్రకటించగా, ఎమ్మెల్యేలు నవ్వుతూ హేళన చేయడం వారిని ముంచెత్తిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గౌరవాన్ని అవహేళన చేయడం సరికాదని, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.