అధిక వడ్డీ పేరుతో ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని మోసం చేసిందని భాదితుల ఫోరమ్ కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ధన్వంతరి ఫౌండేషన్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను డైరెక్టర్లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని, జనవరి15లోగా బాధితులకు కట్టిన డబ్బులు చెల్లించకపోతే సీసీఎస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.