జీడిమెట్ల: కళ్లముందే భార్య దుర్మరణం

69చూసినవారు
జీడిమెట్ల: కళ్లముందే భార్య దుర్మరణం
జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య దుర్మరణం చెందింది. సూరారం రాజీవ్ గాంధీనగర్ చెందిన నాగరాజు, సిప్ర రాణి త్రిపాఠి (28)లకు ఏడాది క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి షాపింగ్‌కు బైక్‌పై వారు సుచిత్రకు వెళ్తున్నారు. రంగ-భుజంగ థియేటర్ వద్ద వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కింద పడిపోయారు. సిప్ర రాణి త్రిపాఠి తలపై నుంచి వాహనం వెళ్లడంతో స్పాట్‌లోనే మృతి చెందింది. కళ్లముందే భార్య మరణించడంతో భర్త రోదనలు మిన్నంటాయి.

సంబంధిత పోస్ట్