భాగ్యలక్ష్మి కాలనీలో పొంగి పారుతున్న నాలా

84చూసినవారు
భాగ్యలక్ష్మి కాలనీలో పొంగి పారుతున్న నాలా
కుత్బుల్లాపూర్ మండలం భాగ్యలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్-4 లో నాలా పొంగి పారుతుందడంతో కాలనీలో మురుగు నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ సందర్బంగా కాలనీ వాసి మందపెల్లి ప్రణదీప్ మాట్లాడుతూ నాలా లీకేజీతో భరించలేని దుర్గంధం వస్తుందని, పాదాచారులు నడలేని పరిస్థితి ఉందని, దోమల బెగద కూడా ఎక్కువ అయిందని, దీనితో పాటు వర్షకాలం కూడా కావడంతో కాలనీ వాసులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్