కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్న ప్రజలకు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ శుభవార్త చెప్పారు. పెండింగ్ ఉన్న నీటి బిల్లులో 10శాతం రాయితీతో వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. వచ్చే సంవత్సరం జనవరి 31 వరకు ఈ పథకం వర్తిస్తుందని కంటోన్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొన్నారు.