బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న బస్తీలో నివసించే మున్నా యాదవ్ అనే వ్యక్తి ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి తన వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.