లొంగిపోయిన దంపతులు.. ఆందోళన

68చూసినవారు
గత 20 ఏళ్లుగా స్థానికులను నమ్మించి చిట్ ఫండ్ పేరిట 144 మందిని రూ. 11 కోట్లకు పైగా మోసం చేసిన బాపూజీనగర్కు చెందిన అమరేందర్ యాదవ్, సబిత దంపతులు మంగళవారం వారాసిగూడ పీఎస్లో లొంగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో పీఎస్కు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించి, తమ డబ్బులను ఇప్పించాలని నినాదాలు చేశారు. ఈ కేసును CCSకు కేసు బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్