పులివెందుల YCP సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప తాలూకా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వర్రా రవీందర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు. వైసీపీ పాలనలో చంద్రబాబు, పవన్, లోకేశ్, అనిత, షర్మిల, విజయలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు చేశాడు. దీంతో ఆయనపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లలో పలు కేసులు నమోదయ్యాయి.