ఫిబ్రవరి ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నకేసీఆర్

50చూసినవారు
ఫిబ్రవరి ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నకేసీఆర్
ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్, డిసెంబర్ 8వ తేదిన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి తుంటికి గాయమయింది. దీంతో ఇప్పటిదాకా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేదు.

సంబంధిత పోస్ట్