సికింద్రాబాద్: గురుద్వారా సమీపంలో మృతదేహం లభ్యం

74చూసినవారు
సికింద్రాబాద్: గురుద్వారా సమీపంలో మృతదేహం లభ్యం
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సుదర్శన్ కథనం ప్రకారం. సికింద్రాబాద్ గురుద్వారా సమీపంలోని మెట్రో పిల్లర్ బి-958 పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) మృతిచెంది ఉన్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. శుక్రవారం పోలీసులు మృత దేహాన్ని పరిశీలించి గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్