హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.