
రంగారెడ్డి: రెండు రోజులు వర్షాలు
ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ములుగు వంటి ప్రాంతాల్లో ఇవాళ వర్షం పడింది. ఇక హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి వేళల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. సోమ, మంగళవారాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.