అగ్నిప్రమాదం ప్రాంతాని పరిశీలించిన ఎమ్మెల్యే

59చూసినవారు
హైదరాబాద్లోని పురానీ హవేలీలో ఉన్న ఎస్కే ఫుట్వేర్ షాప్లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల విలువ చేసే ఫుట్వేర్, ముడిసరుకు దగ్ధమైంది. సమాచారం అందుకున్న మీర్చౌక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సంఘటన స్థలాని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్