యాకుత్ పురా: వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
యాకుత్ పురా నియోజకవర్గంలో అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరజ్ అన్నారు. శుక్రవారం తలబ్ చంచలం డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సిద్దిక్ నగర్, భవానీ నగర్లో రోడ్డు పనులకు, తాలాబ్ కట్టలో సివరేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 18. 95 లక్షలతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు.