తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్ యోగితా రాణా విద్యా శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ సురేంద్ర మోహన్ రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.