ICICI బ్యాంక్‌కు రూ.11,059 కోట్ల లాభాలు

75చూసినవారు
ICICI బ్యాంక్‌కు రూ.11,059 కోట్ల లాభాలు
ప్రముఖ ప్రైవేట్ రంగ పెట్టుబడి సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ జూన్ 2024-25తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో 14.6 శాతం వృద్ధితో రూ.11,059 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,648 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 7.3 శాతం పెరిగి రూ.19,553 కోట్లకు చేరుకుంది. మొండి బాకీల కోసం కేటాయింపులు రూ1,332 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,292 కోట్లు కేటాయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్