తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ యువ నాయకురాలు ఎన్నికల మేనిఫెస్టో సైతం విడుదల చేశారు. ఈ క్రమంలోనే గ్రామంలోని ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా 5 వేల ఆర్థిక సాయం, ఆడపడుచు పెళ్లి కానుక వంటి అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. కాగా.. ఈ మేనిఫెస్టో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.