హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్.. ఫంక్షన్లలో భోజనం చేస్తే వాటర్ బాటిల్.. ప్రయాణాల్లో దాహం వేస్తే వాటర్ బాటిల్.. ఇలా ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకుపైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. సమృద్ధిగా నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామనే భావనతో రోజువారీ జీవితంలో ఎడాపెడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కొనేసి ఉపయోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.