ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 52 నియోజకవర్గాలు, 2 మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి సమస్యలపై నివేదిక సమర్పించనున్నారు.