దేవుడికి సంబంధించిన ఫొటోలు, విగ్రహాలు లాంటివి బెడ్ రూమ్ గదిలో అస్సలు పెట్టకూడదు. ఇలా బెడ్ రూమ్‌లో పెట్టడం వల్ల అపచారం చేసినట్లు అవుతుంది. దీని వలన వాస్తు దోషం ఏర్పడుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయని పండితులు చెబుతున్నారు. సముద్రాలు, పెయింటింగ్స్ వంటి ఫోటోలు కూడా బెడ్ రూమ్‌లో పెట్టకూడదు. ఉదయాన్నే లేచి అద్దంలో ముఖం చూడకూడదు. ఇటువంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని పండితులు అంటున్నారు.