TG: హైదరాబాద్ నుంచి పాద యాత్ర ప్రారంభించాలని సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. మీ పాదయాత్రకు ప్రజలు మద్దతిస్తే ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు అంటూ రేవంత్ రెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికపై మండిపడ్డారు. కాంగ్రెస్ 11 నెలల పాలనలోనే కాకుండా మీ పాదయాత్ర కూడా ఆంక్షల మధ్య కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.