జీవితంలో డబ్బు సంపాదించడం, ఏ పనిలోనైనా విజయం సాధించడాన్ని అంతా కోరుకుంటారు. కొంతమంది దీని కోసం కష్టపడి పనిచేస్తారు. కాని కొన్నిసార్లు నిరాశ ఎదురవుతుంది. ఇలాంటి తరుణంలో మనం చేసే పనిలో విజయం సాధించకుండా అడ్డుపడే కొన్ని విషయాల గురించి చాణక్యుడు తెలిపాడు. వాటి గురించి తెలుసుకుందాం.
సోమరితనం మనిషి యొక్క అతిపెద్ద శత్రువు. ప్రతిభావంతులు జీవితాన్ని వృథా చేయరు. మీరు విజయం సాధించాలనుకుంటే సోమరితనానికి మీరు మీ లైఫ్ లో చోటివ్వకండి. అప్పుడే మీరు విజయం సాధించగలరు. ఎందుకంటే సోమరితనం కారణంగా, చాలా సార్లు ఒక వ్యక్తి కూడా ముఖ్యమైన పనులను పక్కన పెట్టేస్తాడు.
డబ్బు, కీర్తి వచ్చిన వెంటనే అహంలో మునిగిపోకూడదు. ఇలా చేసి తమ మునుపటి స్థితిని మరిచిపోకూడదు. అహం మిమ్మల్ని పాతాళానికి నెట్టేస్తుంది. అహం వల్ల డబ్బును కోల్పోతారు. చాలా నష్టాలను అవమానాలను ఎదుర్కునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ స్థానం ఎలాంటిదైనా అహాన్ని దరిచేరనీయొద్దు.