ఈ కంది ఒక్కసారి వేస్తే ఆరేళ్లు కాస్తుంది!

65చూసినవారు
ఈ కంది ఒక్కసారి వేస్తే ఆరేళ్లు కాస్తుంది!
ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే కంది పంటను జూన్-జులై నెలల్లో సాగు చేస్తే డిసెంబర్, జనవరి నాటికి కాయ ఎండి కోతకు వస్తుంది. అయితే పెరెన్నియల్ అనే కంది రకం మాత్రం ఒక్కసారి పంట వేస్తే ఆరేళ్ల పాటు ఏడాదికి మూడుసార్లు కోతకు వస్తుంది. శ్రీలంకకు చెందిన ఈ పెరెన్నియల్ కందులు లావుగా, మచ్చలతో ఉండటంతో పచ్చి కాయకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే ఈ రకం కంది ఎకరానికి 13 నుంచి 16 క్వింటాళ్ల పంటను అందిస్తుంది.

ట్యాగ్స్ :