కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

65చూసినవారు
కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఉత్త‌రాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌‌లో ఇవాళ హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఆ హెలికాప్ట‌ర్‌లో ఏడుగురు మంది భ‌క్తులు ఉన్నారు. సాంకేతిక లోపం వ‌ల్ల ఆ హెలికాప్ట‌ర్‌ను అత్య‌వ‌స‌రంగా దించేశారు. హెలిప్యాడ్‌కు కొన్ని మీట‌ర్ల దూరంలో ఆ హెలికాప్ట‌ర్‌ను ల్యాండ్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఏడుగురి భ‌క్తుల‌తో పాటు పైల‌ట్ ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్