కేబినెట్ నియామకాల కమిటీ (ACC) భారత విదేశాంగ సేవ (IFS) 2014 బ్యాచ్ అధికారి నిధి తివారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీ (PS)గా నియమించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించిన నిధి తివారి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ టాక్స్)గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె, 2023 జనవరి నుంచి కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగంలో (DoPT) సేవలు అందిస్తున్నారు.