వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్ ఎదుట క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కలకలం రేపాయి. ఉదయాన్నే అటుగా వెళ్తున్న కొందరు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. కాలేజీ ఎదుట పసుపు, కుంకుమలతో పాటు క్షుద్రపూజలకు వినియోగించే సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.దీంతో కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు సైతం జంకుతున్నారు. . వికారాబాద్ పరిధిలో గతంలో కూడా క్షుద్రపూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే.