ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులు, దుస్తుల కోసం వెతికినప్పుడు ఉన్నపళంగా ‘కౌంట్‌డౌన్’ సేల్ ప్రకటనలు వస్తాయి. ఇంకో రోజులోనో, ఇంకో గంటలోనో ఆఫర్ ముగుస్తుందంటూ హడావుడి చేసేలా ఉంటాయవి. ఏదోఒకలా మనచేత కొనిపిస్తేగాని వాటి వెనక ఉన్న డార్క్ ప్యాటర్న్‌లు శాంతించవు. ఆపిల్, అమెజాన్, స్కైప్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం కొన్ని మోసపూరిత డిజైన్లు వాడుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.