అదానీ, అంబానీల దోపిడీ వ్యవస్థకు చెక్ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ లో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ లో మాట్లాడారు. అదానీ, అంబానీ వంటి కొద్ది మంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జోడో యాత్ర చేశారన్నారు.