పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌ కంటే వెనుకబడిన ఇండియా

83చూసినవారు
పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌ కంటే వెనుకబడిన ఇండియా
పదేళ్ల తమ జమానాలో దేశం అంతైంది ఇంతైందని ప్రధాని మోడీ, బిజెపి నేతలు దేశ విదేశాల్లో గొప్పలకు పోతున్న సమయంలో తాజాగా 2024 సంవత్సరానికి ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచి అదంతా వాగాడంబరమేనని కొట్టిపారేసింది. అత్యంత సిగ్గు చేటైన విషయం ఏంటంటే మన పొరుగునున్న నేపాల్‌, శ్రీలంక, మయన్మార్‌, పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌ కంటే కూడా ఇండియా వెనకబడటం. తెల్లారి లేస్తే పాక్‌, అఫ్ఘాన్‌లపై ఒంటికాలిపై లేచే మోడీ సర్కారుకు ఈ పరిణామం తలదించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది.

ట్యాగ్స్ :