మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి, అవి వారసత్వంగా కొనసాగుతున్నవి కూడా. కళల పేరిట భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టేవి. అలాంటి వాటిలో చేతి వృత్తులు చాలా ఉన్నాయి. చేతి వృత్తులలో చేనేతకు ఎంతో చరిత్ర ఉంది. భారతదేశంలో స్వదేశీ ఉద్యమం 1905లో మొదలైంది. అప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ ఖద్దరు దుస్తులు వేసుకుంటూ నిరసన తెలిపారు. భారతీయ చేనేత పరిశ్రమకు ఎంత చరిత్ర ఉందో ఈ పరిశ్రమలో అంత కళాత్మకత కూడా ఉంది.