పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. పూల్-B నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్డర్ ఫైనల్ చేరాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి.