నేడు యూఎస్ వెళ్లనున్న భారత ఆటగాళ్లు

74చూసినవారు
నేడు యూఎస్ వెళ్లనున్న భారత ఆటగాళ్లు
టీ20 ప్రపంచ కప్ కోసం నేడు టీమిండియా ఆటగాళ్లు కొందరు అమెరికా వెళ్లనున్నారు. తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, సూర్య, అర్ష్‌దీప్ తదితరులు ముంబై నుంచి విమానం ఎక్కనున్నారు. సెకండ్ బ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్ బయల్దేరనున్నారు. హార్దిక్ పాండ్య లండన్‌లో ఉండటంతో అక్కడి నుంచే నేరుగా యూఎస్ వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :