భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు: WHO

78చూసినవారు
భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు: WHO
భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. పశ్చిమ‌బెంగాల్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి H9N2 బర్డ్ ఫ్లూ వైరస్ బారిన పడినట్లు WHO ధ్రువీకరించింది. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని జ్వరం, కడుపులో ఇబ్బంది తదితర సమస్యలతో ఫిబ్రవరిలో ఆస్పత్రిలో చేర్పించారు. పలు చికిత్సల అనంతరం చిన్నారిని 3 నెలల తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు WHO పేర్కొంది.

సంబంధిత పోస్ట్