ఐక్యూ తక్కువైతే పక్షవాతం బారిన పడే ప్రమాదం

76చూసినవారు
ఐక్యూ తక్కువైతే పక్షవాతం బారిన పడే ప్రమాదం
బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు 50 ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారినపడే ప్రమాదముందని ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులో మానసిక శక్తి తక్కువగా ఉంటే పెద్దయ్యాక గుండె, రక్తనాళ సమస్యలు, జీవక్రియ సమస్యలు వస్తాయని తెలిపారు. తక్కువ ఐక్యూ స్కోరు ఉన్నవారికి ముందు నుంచే ఆరోగ్యపరంగా సహాయసహకారాలు అందించి పక్షవాత ప్రమాదాన్ని తగ్గించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్