మెట్రో, సబ్‌అర్బన్ సర్వీసులకు అంతరాయం

80చూసినవారు
మెట్రో, సబ్‌అర్బన్ సర్వీసులకు అంతరాయం
కొన్ని రోజులుగా వేడితో సతమతమవుతోన్న ముంబైని వర్షం పలకరించింది. నగరంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొన్నిచోట్ల తీవ్రస్థాయిలో దుమ్మురేగింది. బలమైన గాలులకు హోర్డింగులు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. దీంతో మెట్రోతోపాటు లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ఠాణె, పాల్ఘర్, ముంబై ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్స్ :