ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. సెట్ 1లో తొలి ప్లేయర్గా స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ బరిలోకి వచ్చాడు. ఫ్రాంఛైజీల మధ్య హోరాహోరీ పోటీ అనంతరం చివరికి పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ విధానంలో రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అర్ష్దీప్ కోసం చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్, రాజస్థాన్, హైదరాబాద్ ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.